బుధవారం 15 జూలై 2020
Telangana - Jun 05, 2020 , 17:58:13

దాతృత్వం మాన‌వ‌త్వానికి నిద‌ర్శన‌ం

దాతృత్వం మాన‌వ‌త్వానికి నిద‌ర్శన‌ం

జనగాం : ప్రతి ఒక్కరూ సేవా గుణం అలవర్చుకోవాలని పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. జిల్లాలోని రాయపర్తి మండలం మైలారంలో దాతలు బొమ్మినేని రంగారెడ్డి, సుజాత, అమ‌రేంద‌ర్, న‌రేంద‌ర్, సురేందర్ స‌మ‌కూర్చిన స‌రుకుల‌ను మంత్రి పేద‌ల‌కు అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా మంత్రి దయాకర్ రావు మాట్లాడుతూ, దాతృత్వం మాన‌వ‌త్వానికి నిద‌ర్శన‌మ‌న్నారు. కరోనా నేపథ్యంలో అన్నార్థులకు అండగా ఉండాలన్నారు.

ఇత‌రుల‌కు సాయం చేయ‌డంలో ఉన్నతృప్తి మ‌రెందులోనూ లేద‌న్నారు. పోయేనాడు ఎవ‌రూ ఏదీ క‌ట్టకట్టుకొని పోలేర‌ని, ఉన్నప్పుడే, కాస్త పేరు, కీర్తి సంపాదించుకోవాల‌ని చెప్పారు. అలాగే క‌రోనా నేప‌థ్యంలో బ్యాంకు లింకేజీతో పాల‌కుర్తి నియోజ‌క‌వ‌ర్గానికి మంజూరైన రూ.12 కోట్ల స్వయం స‌హాయ‌క గ్రూపుల నిధుల‌ను మంత్రి ద‌యాక‌ర్ రావు పాల‌కుర్తి మండ‌లం మంచిప్పుల‌లో విడుద‌ల చేశారు. మ‌హిళా సంఘాలు పొదుపుతోపాటు వారికి ఇచ్చిన నిధుల‌ను స‌ద్వినియోగం చేసుకుంటున్నారని మంత్రి తెలిపారు. 


logo