హైదరాబాద్, జూన్ 18 (నమస్తే తెలంగాణ): హరిత తెలంగాణ కోసం కృషి చేస్తున్న అభినవ అశోకుడు సీఎం కేసీఆర్ అని పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ కొనియాడారు. సీఎం కేసీఆర్ మానసపుత్రిక హరితహారమని ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 273.33 కోట్ల మొకలను నాటడం హర్షణీయమని అన్నారు. కేసీఆర్ సంకల్పానికి తోడుగా ఎంపీ సంతోష్‌కుమార్ గ్రీన్ చాలెంజ్ ఉద్యమం వినూత్నమైనదని కొనియాడారు. మంత్రి కేటీఆర్ చొరవ తీసుకొని అర్బన్ ఫారెస్ట్రీ కింద అత్యాధునిక హంగులతో ప్రజలకు అనుకూలంగా ఉండే పారులను ఏర్పాటు చేస్తుండటం అభినందనీయమని అన్నారు.