హైదరాబాద్, ఏప్రిల్ 22 (నమస్తే తెలంగాణ) : ఎఫ్‌డీహెచ్‌ఎస్ ఫార్మసీ ఆఫీసర్లకు 10 నెలల పెండింగ్ వేతనాలను వెంటనే విడుదల చేయాలని ఫార్మసీ ఆఫీసర్ల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బత్తిని సుదర్శన్ గౌడ్ డిమాండ్ చేశారు. బుధవారం ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహకు ఆయన వినతి పత్రం అందజేశారు. ఎంహెచ్ఎస్ఆర్బీ ద్వారా పరీక్షలు రాసిన 732 మంది ఫార్మసీ ఆఫీసర్ల ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ విడుదల చేసి ఖాళీలన్నీ భర్తీ చేయాలని ఆయన కోరారు.
ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అదనంగా ఏ ఫార్మసీ ఆఫీసర్ల పోస్టులను క్రియేట్ చేయాలని విజ్ఞప్తి చేశారు. డైరెక్టర్ ఆఫ్ ఫార్మసీ డిపార్ట్మెంట్ను ఏర్పాటు చేయాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కందకట్ల శరత్‌బాబు, స్టేట్ అసోసియేట్ ప్రెసిడెంట్ జాలిగామ అశోక్, హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.