హైదరాబాద్, జూన్ 20 (నమస్తే తెలంగాణ): దేశంలో ఫార్మసీ వృత్తి ‘పారా మెడికల్ గ్రూప్’ పరిధిలోకి రాదని ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (పీసీఐ) స్పష్టం చేసింది. ఈ మేరకు పీసీఐ తాజాగా ఉత్తర్వులు జారీ చేసినట్టు తెలంగాణ ఫార్మా సొసైటీ రాష్ట్ర అధ్యక్షుడు ఆకుల సంజయ్ రెడ్డి మంగళవారం తెలిపారు.
ఫార్మసీ వృత్తికి పూర్తి స్వతంత్ర ప్రతిపత్తి ఇచ్చినట్టు వెల్లడించారు. ఫార్మసీ విద్యను పారా-మెడికల్ విద్యతో అనుసంధానం చేయరాదని స్పష్టం చేసినట్టు వివరించారు.