యాచారం, జూలై 3 : ‘విషం చిమ్మే ఫార్మాసిటీ వద్దు.. వ్యవసాయమే ముద్దు’ అంటూ ఫార్మా బాధిత రైతులు నినదించారు. ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి ఫార్మాసిటీని రద్దు చేయాలని డి మాండ్ చేశారు. రైతుల భూములను రైతులకే ఇవ్వాలని, నిషేధిత జాబితాలో ఉన్న 2,500 ఎకరాల భూములను వెం టనే రైతుల పేరిట ఆన్లైన్లో నమోదు చేయాలని ప్లకార్డులు ప్రదర్శించారు. ఫార్మాసిటీ బాధిత రైతులందరికీ రైతుభరోసా, రైతుబీమా, పంట రుణాల మాఫీ వర్తింపజేయాలని విజ్ఞప్తి చేశారు. రంగారెడ్డి జిల్లా పరిధిలోని ఫార్మా గ్రామాల్లో ఫార్మాసిటీ వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో గురువారం పాదయాత్ర నిర్వహించారు.
యాచారం మండలం కుర్మిద్ద గ్రామంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అ క్కడినుంచి తాటిపర్తి, నానక్‌నగర్, మేడిపల్లి వరకు పాదయాత్ర చేపట్టారు. జై కి సాన్, జై భీమ్ నినాదాలు మిన్నంటాయి.అధికారంలోకి వస్తే ఫార్మాసిటీని రద్దు చేస్తామన్న కాంగ్రెస్ నాయకులు.. నేడు పదవులు రాగానే రైతులను విస్మరించడం ఎంతవరకు సమంజసమని పీపుల్స్ జే ఏసీ నాయకులు ఆగ్రహం వ్యక్తంచేశారు. జేఏసీ జాయింట్ కన్వీనర్ కన్నెగంటి ర వి, పర్యావరణవేత్త బాబూరావు, ఫార్మా వ్యతిరేక పోరాట కమిటీ సమన్వయకర్త క వుల సరస్వతి మాట్లాడుతూ.. పార్మాసి టీని రద్దు చేస్తామని చెప్పి, ప్రభుత్వం మాట తప్పిందన్నారు. ప్రాణాలు పోయి నా భూములను మాత్రం త్యాగం చేసేది లేదని స్పష్టంచేశారు.