న్యూఢిల్లీ: హర్యానాలోని మిట్స్ హెల్త్‌కేర్ ప్రైవేట్ లిమిటెడ్ ఉద్యోగులకు ఈ ఏడాది దీపావళి అత్యంత ఆనందోత్సాహాలతో జరుగుతున్నది. ఈ కంపెనీ డైరెక్టర్ ఎంకే భాటియా వీరిని ‘సెలబ్రిటీ’లుగా గౌరవిస్తున్నారు. అత్యంత నమ్మకంతో పనిచేస్తున్న 12 మందిని ఎంపిక చేసి దీపావళి కానుకగా కార్లను బహూకరించారు.
మరో 38 మందికి ఇదే విధంగా త్వరలో కార్లను బహుమతిగా ఇవ్వబోతున్నట్లు తెలిపారు. ఉద్యోగుల అంకితభావం, కఠోర శ్రమ, విధేయత, విశ్వసనీయత వల్లే తన కంపెనీ విజయం సాధిస్తున్నదని చెప్పారు.