PGRRCDE | ఉస్మానియా యూనివర్సిటీ : ఉస్మానియా యూనివర్సిటీ దూరవిద్యా కేంద్రమైన ప్రొఫెసర్ జి. రాంరెడ్డి సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ (పీజీఆర్ఆర్సీడీఈ) ద్వారా అందించే ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన ప్రవేశ పరీక్షకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఓయూ డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ పాండురంగారెడ్డి తెలిపారు. దరఖాస్తులను ఆన్లైన్ విధానంలో వచ్చే నెల 2వ తేదీ వరకు స్వీకరించనున్నట్లు చెప్పారు. రూ.500 అపరాధ రుసుముతో 5వ తేదీ వరకు దరఖాస్తులు దాఖలు చేయవచ్చని పేర్కొన్నారు. ఈ పరీక్షను వచ్చే నెల 7వ తేదీన నిర్వహిస్తామన్నారు. టీఎస్ఐసెట్-2025లో అర్హత సాధించినవారు ఈ పరీక్షకు హాజరుకావాల్సిన అవసరం లేదని, వారు నేరుగా ప్రవేశాలు పొందవచ్చని వివరించారు. ఇతర వివరాలకు www.ouadmissions.com, www.osmania.ac.in, www.oucde.net వెబ్సైట్లో చూసుకోవాలని సూచించారు.