OU | ఉస్మానియా యూనివర్సిటీ : ఉస్మానియా యూనివర్సిటీ దూర విద్యా కేంద్రమైన ప్రొఫెసర్ జి రామ్ రెడ్డి సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ (పీజీఆర్ఆర్ సీడీఈ) ద్వారా అందించే అన్ని డిగ్రీ కోర్సుల పరీక్షా ఫలితాల రివాల్యుయేషన్‌కు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ రివాల్యుయేషన్‌కు ఒక్కో పేపర్‌కు రూ.500 చొప్పున చెల్లించి ఈ నెల 19వ తేదీలోగా టీఎస్ ఆన్లైన్ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. రూ.200 అపరాధ రుసుముతో 21వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. జవాబు పత్రాల నకలు పొందగోరువారు ఒక్కో పేపర్‌కు రూ. 1000 చొప్పున చెల్లించి 21వ తేదీ వరకు తమ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. ఇతర వివరాలకు ఓయూ వెబ్సైట్లో చూసుకోవచ్చని సూచించారు.