PGRRCDE | ఉస్మానియా యూనివర్సిటీ: ఉస్మానియా యూనివర్సిటీ దూరవిద్యాకేంద్రమైన ప్రొఫెసర్ జి. రాంరెడ్డి సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ (పీజీఆర్ఆర్ సీడీఈ) ద్వారా అందించే వివిధ డిప్లొమా కోర్సుల పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు. పీజీ డిప్లొమా ఇన్ డేటా సైన్స్, అడ్వాన్స్డ్ డిప్లొమా ఇన్ డేటా సైన్స్, పీజీ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్, అడ్వాన్స్డ్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ తదితర కోర్సుల మొదటి సెమిస్టర్ మెయిన్, మొదటి, రెండో సెమిస్టర్ బ్యాక్లాగ్ పరీక్షలను ఈ నెల 23వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు చెప్పారు. పరీక్షా తేదీల పూర్తి వివరాలకు ఓయూ వెబ్సైట్ www.osmania.ac.inలో చూసుకోవచ్చని సూచించారు.