హైదరాబాద్, సెప్టెంబర్ 23 (నమస్తే తెలంగాణ) : నిలోఫర్ హాస్పిటల్ ప్రాంగణంలో 280 మంది డాక్టర్లు (పీజీ స్టూడెంట్స్, సీనియర్ రెసిడెంట్స్) ఉండేందుకు అనువుగా హాస్టల్ బిల్డింగ్స్ నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
మంగళవారం ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశాల మేరకు హెల్త్ సెక్రటరీ క్రిస్టీనా జడ్ చొంగ్తూ నిలోఫర్లో హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ సమావేశాన్ని నిర్వహించారు. హాస్టల్ బిల్డింగ్ నిర్మాణం కోసం నిలోఫర్ హాస్పిటల్ ప్రాంగణంలో స్థల పరిశీలన చేశారు.