హైదరాబాద్, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ) : పదోన్నతుల రిజర్వేషన్ అమలులో వర్తింపజేస్తున్న జీవో-2ను సవరించాలని ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం నేతలు తొంట సత్యనారాయణ, పెంట అంజయ్య, దానయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు బుధవారం మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు.
జీవో-2లో అడిక్వసీ పదాన్ని సాకుగా చూపిస్తూ ఓపెన్ రిక్రూట్మెంట్ అయిన వారిని, ఓపెన్‌లో పదోన్నతి పొందిన వారిని ఎస్సీ, ఎస్టీ కోటాలో లెక్కిస్తున్నారని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఎస్సీలకు 15, ఎస్టీలకు 10% కోటా పూర్తికాగానే, ఎస్సీ, ఎస్టీ రోస్టర్‌ను ఓపెన్ వారికి కేటాయిస్తున్నారని ఆందోళన వ్యక్తంచేశారు.