గద్వాల, ఆగస్టు 19 : రైతులకు యూరియా కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని, జూరాల డ్యాం గేట్ల మరమ్మతులు, రిజర్వాయర్లను నీటితో నింపాలని కోరుతూ మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి మంగళవారం జోగుళాంబ గద్వాల కలెక్టర్ సంతోష్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వం గద్వాల జిల్లాకు ఈ ఏడాది పంటకు సరిపడేలా 15 వేల టన్నుల యూరియా కేటాయించిందని తెలిపారు. జూరాల ప్రాజెక్టు గేట్ల రూప్ల మార్పు, రబ్బర్ సీళ్లు, స్టాప్‌లాక్ గేట్‌ను జలాశయం గేట్ల వెనుక భాగాన ఏర్పాటు చేయాలని కోరగా.. స్పందించిన నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రాజెక్టు పరిశీలన చేసి ప్రతిపాదనలు పంపాలని అధికారులకు
ఆదేశించారని గుర్తుచేశారు.
మిరుదొడ్డి (అక్బర్పేట-భూంపల్లి), ఆగస్టు 19 : రైతులను అరిగోస పెడుతున్న కాంగ్రెస్‌కు యూరియానే ఉరితాడుగా మారుతుందని సిద్దిపేట జిల్లా దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి పేర్కొన్నారు. యూరియా కొరతపై మంగళవారం సిద్దిపేట జిల్లా అక్బర్పేట-భూంపల్లి రహదారిపై రైతులతో బీఆర్ఎస్ నాయకులు ధర్నా, రాస్తారోకో నిర్వహించగా ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచి పోయాయి. బీఆర్ఎస్ శ్రేణులు చేస్తున్న ఆందోళనను పోలీసులు బలవంతంగా విరమింపజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఒక లారీలో 400 యూరియా బస్తాలు వస్తే 2వేలు మంది క్యూ కడుతున్నారని ఆవేదనవ్యక్తంచేశారు. బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వాల చేతగాని తనంతోనే యూరియా కొరత ఏర్పడిందని విమర్శించారు.