హైదరాబాద్, మే 5 (నమస్తే తెలంగాణ): మాజీ క్రికెటర్ మహ్మద్ అజారుద్దీన్, ప్రొఫెసర్ ఎం కోదండరాంను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నియమించడం చట్టవ్యతిరేకమని పేరొంటూ హైకోర్టులో వ్యాజ్యం దాఖలైంది. వారిద్దరిని ఎమ్మెల్సీలుగా నియమిస్తూ గత నెల 26న రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన జీవో 71కు వ్యతిరేకంగా హైదరాబాద్‌కు చెందిన సయ్యద్ హైదర్ ఈ పిటిషన్ వేశారు.
నామినేషన్ విధానంలో ఎమ్మెల్సీలుగా ఎంపిక చేసిన కోదండరాం, అజారుద్దీన్‌కు రాజ్యాంగం నిర్దేశించిన అర్హతలు లేవని పిటిషనర్ తెలిపారు. ప్రభుత్వ నిర్ణయాన్ని చట్టవిరుద్ధమైనదిగా ప్రకటించాలని, జీవో 71 అమలును వెంటనే నిలిపివేస్తూ ఆదేశాలు ఇవ్వాలని కోరారు.