మంగళవారం 31 మార్చి 2020
Telangana - Mar 14, 2020 , 18:03:28

అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

మెదక్‌: జిల్లాలోని శివంపేట మండలం సీతారాం తండలో విషాద ఘటన చోటు చేసుకుంది. తండాకు చెందిన వేణు(45) అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మృతదేహాన్ని గమనించిన పశువుల కాపరులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతదేహం సమీపంలో రక్తపు మరకలు, శరీరంపై గాయాలు, శవాన్ని ఈడ్చుకు వెళ్లిన గుర్తులు ఉండటంతో వేణును గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. 


logo
>>>>>>