హైదరాబాద్, మార్చి 25 (నమస్తే తెలంగాణ): ప్రతిష్ఠాత్మక ‘మన ఊరు, మన బస్తీ- మన బడి కార్యక్రమంలో చేపట్టే పనులకు 15 రోజుల్లో అనుమతులు ఇవ్వాలని విద్యాశాఖ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా జిల్లా కలెక్టర్లను, ఇంజినీర్లను ఆదేశించారు. ఆన్లైన్ ద్వారా అనుమతులు ఇవ్వాలని సూచించారు. ‘మన ఊరు -మన బడి’పై శుక్రవారం సందీప్‌కుమార్ సుల్తానియా, హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఇంజినీరింగ్ విభాగం అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా తాము సూచించిన 8 పనులను మాత్రమే చేపట్టాలని ఆదేశించారు. నిధుల మంజూరుకు జాయింట్ చెక్ పవర్‌ను సంబంధిత పాఠశాల హెచ్ఎం, ఎస్ఎంసీ చైర్మన్ వరకే పరిమితం చేసినట్టు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్లకు పలు ఆదేశాలిచ్చారు.