హైదరాబాద్, జనవరి 9 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని 14 ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 201 టీచింగ్(ట్యూటర్) పోస్టుల భర్తీకి అనుమతి ఇస్తూ సోమవారం ఆర్థికశాఖ ఉత్తర్వులిచ్చింది. కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ పద్ధతిలో నియమిస్తామని, ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. అభ్యర్థులు ఈ ఏడాది మార్చి 31 వరకు లేదా ఆ పోస్టు భర్తీ చేసే వరకు ఉద్యోగంలో కొనసాగుతారని పేర్కొన్నది. ఎంపికైన వారికి నెలకు రూ.57,700 వేతనం చెల్లించనున్నట్టు తెలిపింది. జిల్లాల వారీగా తీసుకొంటే నిజామాబాద్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో 16 పోస్టులు, మహబూబ్‌నగర్ 10, సిద్దిపేట8, నల్లగొండ18, సూర్యాపేట 18, సంగారెడ్డి13, నాగర్‌కర్నూల్ 14, వనపర్తి16, భద్రాద్రి కొత్తగూడెం15, జగిత్యాల 14, మంచిర్యాల13, మహబూబాబాద్ 14, రామగుండం16, ఆదిలాబాద్ రిమ్స్‌లో 16 పోస్టులను భర్తీ చేయనున్నట్టు వివరించింది.