వరంగల్ ఎన్ఐటీలో నాలుగేండ్ల బీఈడీ
ఐఐటీలు, ఎన్ఐటీల్లో నాలుగేండ్ల ఇంటిగ్రేటెడ్ బీఎడ్ కోర్సులను ప్రవేశపెట్టే అంశంపై కీలక ముందడుగు పడింది. ఈ విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలోని ఎన్ఐటీ వరంగల్‌లో నాలుగేండ్ల బీఈడీ కోర్సుకు అనుమతి లభించింది.
- ఉర్దూవర్సిటీ, లక్షెట్టిపేట డిగ్రీ కాలేజీకీ అనుమతులు మంజూరు
- మూడు కాలేజీల్లో కలిపి 250 సీట్లు
- ఎన్టీఏ ప్రవేశపరీక్ష ద్వారా ఎంపిక
- దరఖాస్తులకు జూలై 19 చివరి తేదీ
హైదరాబాద్, జూన్ 27 (నమస్తే తెలంగా ణ): ఐఐటీలు, ఎన్ఐటీల్లో నాలుగేండ్ల ఇంటిగ్రేటెడ్ బీఎడ్ కోర్సులను ప్రవేశపెట్టే అంశంపై కీలక ముందడుగు పడింది. ఈ విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలోని ఎన్ఐటీ వరంగల్‌లో నాలుగేండ్ల బీఈడీ కోర్సుకు అనుమతి లభించింది. ఎన్ఐటీ వరంగల్‌లో బీఎస్సీ-బీఎడ్ కోర్సును 50 సీట్లతో నిర్వహిస్తారు.
ఎన్ఐటీ వరంగల్‌తోపాటు, గచ్చిబౌలిలోని మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ యూనివర్సిటీ, లక్షెట్టిపేట ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో కలిపి మొత్తం 250 సీట్లకు అనుమతి లభించింది. ఆయా సీట్లను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నిర్వహించే నేషనల్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (ఎన్సీఈటీ) ద్వారా భర్తీచేయనున్నారు. ఎన్సీఈటీ నోటిఫికేషన్‌ను ఎన్టీఏ ఇటీవలే విడుదల చేసింది. దరఖాస్తుల స్వీకరణ మంగళవారం నుంచే ప్రారంభమైంది. అభ్యర్థులు జూలై 19 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. వివరాల కోసం www.nta.ac.in, https://ncet .samarth.ac.in వెబ్సైట్లను సంప్రదించవచ్చు.

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

