హైదరాబాద్, ఆగస్టు 19 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ నాయకులకు పాలన చేతకావడం లేదని, ప్రజలు ఎదురొంటున్న తక్షణ సమస్యలను పరిషరించడంలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర బుదవారం ఒక ప్రకటనలో విమర్శించారు. కేసీఆర్ హయాంలో కట్టిన సనత్‌నగర్ టిమ్స్ భవనాలను సీఎం రేవంత్‌రెడ్డి తానే కట్టినట్టుగా గొప్పలు చెప్పుకోవడం విడ్డూరంగా ఉన్నదని ఎద్దేవా చేశారు. సనత్‌నగర్ టిమ్స్‌కు సంబంధించిన వాస్తవాలు ప్రజలకు వివరించేందుకు వెళ్లున్న హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్, సబితాఇంద్రారెడ్డితోపాటు మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ను పోలీసులు గృహ నిర్బంధించడం అభ్యంతరకరమని పేర్కొన్నారు.
22ఏ ఆంక్షలతో భూముల అక్రమాలు
రాష్ట్రంలోని నిషేధిత భూముల జాబితా (22ఏ)ను అధికారపక్ష నాయకులు ఇష్టారాజ్యంగా మారుస్తూ, ప్రైవేట్, అసైన్డ్ భూములను అందులో చేర్చి అక్రమాలకు పాల్పడుతున్నారని ఎంపీ వద్దిరాజు ఆరోపించారు. ఈ వ్యవహారంలో బాధ్యులైన వారు ఎంతటి స్థాయిలో ఉన్నప్పటికీ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ పథకాల రద్దుకు ప్రభుత్వం కుట్రలు చేస్తున్నదని మండిపడ్డారు. ఫీజు బకాయిలు చెల్లించకపోవడంతో విద్యార్థులు రోడ్డెకుతున్నారని చెప్పారు. ఉద్యోగులకు పీఆర్సీ, డీఏలు అమలు చేయకపోవడం, ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేయకపోవడంతో యువత ఆందోళన బాట పట్టిందని పేరొన్నారు. రైతుబీమా ఎత్తివేయడం, సాగునీరు, యూరియా సరఫరాలో తీవ్ర అంతరాయాలతో రైతన్నలు ఆగ్రహంతో ఉన్నారని వివరించారు. కాంగ్రెస్ అస్తవ్యస్త పాలనతో విసిగిపోయిన ప్రజలు కేసీఆర్‌ను తిరిగి ముఖ్యమంత్రిని చేసుకొనేందుకు ఎదురుచూస్తున్నారని తెలిపారు.