హైదరాబాద్ : సీఎం కేసీఆర్ దివ్యాంగులకు పెద్దన్నలా మారి జీవితాల్లో వెలుగులు పూయిస్తున్నారు. గతంలో వారు అడగకముందే పెన్షన్‌ను పెంచిన సీఎం కేసీఆర్ తాజాగా మరో వెయ్యి రూపాయలు పెంచి 4,116 చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఈ మేరకు రాష్ట్ర సంక్షేమ, దివ్యాంగుల శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ను హైదరాబాద్‌లోని మంత్రుల నివాస ప్రాంగణంలో మంగళవారం పలువురు దివ్యాంగులు కలిశారు.
ప్రభుత్వం తమకు ఇస్తున్న పెన్షన్ నాలుగు వేలకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం ఉద్యోగాల్లో, విద్యా సంస్థలోనూ దివ్యాంగులకు సమూచిత ప్రాధాన్యత, రిజర్వేషన్ సౌకర్యం కల్పిస్తుందన్నారు. ప్రభుత్వం నూతనంగా అమలు చేస్తున్న గృహలక్ష్మి పథకంలోకలిసి తమకు ప్రభుత్వం కల్పిస్తున్న సంక్షేమ పథకాలు అమలు చేయించుకోవాలని మంత్రి సూచించారు.