Praja Palana | గ్రామసభలు నిర్వహించిన మూడో రోజు గురువారం కూడా ప్రజలు ఎక్కడికక్కడ అధికారులను, కాంగ్రెస్ నాయకులను నిలదీశారు. రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా తదితర పథకాల గురించి ప్రశ్నించారు. అర్హులకే పథకాలు వర్తింపజేయాలని కోరారు.
కొన్ని చోట్ల జాబితాలో పేర్లు లేకపోవడంతో ఆడబిడ్డలు కంటతడి పెట్టారు. కొన్ని చోట్ల స్థానికులపై అధికార కాంగ్రెస్ నాయకులు చెయ్యి చేసుకున్నారు. మొత్తానికి మూడు రోజులుగా గ్రామసభలు, వార్డు సభల్లో ప్రజల అసంతృప్తి అడుగడుగునా కనిపించింది.
కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం సైదాబాద్‌లో గ్రామసభ నిర్వహణ తీరును నిరసిస్తూ నేలపై కూర్చొని నిరసన తెలుపుతున్న హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి
కామారెడ్డి జిల్లా బాన్సువాడలో రుణమాఫీ, రైతు భరోసా గురించి ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డిని నిలదీస్తున్న బీఆర్ఎస్ నేత షేక్ జుబేర్
ఖమ్మం పట్టణంలో నిర్వహించిన వార్డు సభలో మహిళలతో కలిసి అధికారులను నిలదీస్తున్న ఎమ్మెల్సీ తాతా మధు
వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని ఎంఐజీ కాలనీవాసులు గ్రామ సభకు రాకపోవడంతో ఖాళీ కుర్చీలకు పథకాల వివరాలు చదివి వినిపిస్తున్న వార్డు ఆఫీసర్
ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాలేదని అధికారులు చెప్పడంతో వారి ఎదుటే కన్నీరుమున్నీరవుతున్న
ఖమ్మం జిల్లా బోనకల్లు మహిళ మందపల్లి సుజాత
నారాయణపేట జిల్లా మద్దూరు మండలం మోమిన్‌పూర్‌లో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల వాగ్వాదం
పథకాలకు అనర్హులను ఎంపిక చేశారంటూ భద్రాద్రి జిల్లా ములకలపల్లి గ్రామసభ పంచాయతీ కార్యాలయ గేటు వద్ద బైఠాయించి నిరసన తెలుపుతున్న గ్రామస్తులు
కామారెడ్డి జిల్లా లింగంపేట్‌లో ఇందిరమ్మ ఇల్లు రాలేదని విలపిస్తున్న ఒడ్డె సావిత్రి
జోగుళాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలం ఎల్కూరులో అధికారులను నిలదీస్తున్న స్థానికులు
మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండలం మన్నెగూడెం గ్రామ సభలో స్థానికుడిపై చేయి చేసుకుంటున్న కాంగ్రెస్ నాయకుడు
ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలోని ధన్నూర్(బీ)లో బీఆర్ఎస్-కాంగ్రెస్ నాయకుల మధ్య వాగ్వాదం
కామారెడ్డి జిల్లా లింగంపేట్‌లో తనకు రేషన్ కార్డు ఎందుకు రాలేదని అధికారులను నిలదీస్తున్న స్థానిక మహిళ
యాదగిరిగుట్ట మల్లాపురం గ్రామసభలో కాంగ్రెస్ నాయకుడు, స్థానికుల మధ్య వాగ్వాదం
మేడ్చల్ జిల్లా తుర్కపల్లిలో అధికారులను, కాంగ్రెస్ పార్టీ నేతలను నిలదీస్తున్న స్థానికుడు
నల్లగొండ జిల్లా త్రిపురారం మండలం బెజ్జికల్ గ్రామపంచాయతీ వద్ద దీక్ష చేస్తున్న వంగాల విజయ్
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం శేఖాపూర్ తండాలో పోలీసుల మధ్యే గ్రామ సభ నిర్వహించిన అధికారులు
కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండలం అంకోల్‌తండాలో అధికారులపై స్థానికుల ఆగ్రహంl
పెద్దపల్లి జిల్లా కమాన్‌పూర్ మండలం జూలపల్లి గ్రామ సభలో అర్హులకు పథకాలు అందజేయాలంటూ అధికారి కాళ్లు మొక్కుతున్న మాజీ ఉప సర్పంచ్ సాయికుమార్