నాగర్‌కర్నూల్, ఫిబ్రవరి 10 : పెంట్లవెల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో రుణాలు తీసుకొని మాఫీ కాని పది మంది రైతులు సోమవారం నాగర్‌కర్నూల్ కలెక్టరేట్‌కు వచ్చారు. అఖిలపక్ష నాయకులతో కలిసి తమకు రుణమాఫీ కాలేదని అడిషనల్ కలెక్టర్ అమరేందర్‌కు వినతిపత్రం అందజేశారు.
పెంట్లవెల్లి పీఏసీఎస్‌లో 1400 మం ది రైతులకు సభ్యత్వం ఉన్నదని, అం దులో రూ.2 లక్షల రుణ మాఫీకి 499 మంది అర్హులుగా ఉన్నా.. ఏ ఒక్కరికీ మాఫీ కాలేదన్నారు. ఈ విషయాన్ని తహసీల్దార్లు, ఆర్డీవోకు ఎన్నిసార్లు విన్నవించినా లాభం లేదని వాపోయారు.