మామిళ్లగూడెం/ ఖమ్మం, నవంబర్17: పెన్షనర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలకుర్తి కృష్ణమూర్తి డిమాండ్ చేశారు. పెన్షనర్ల బెనిఫిట్లను తక్షణమే అందించాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం కలెక్టరేట్ ఎదుట వారం రోజులుగా కొనసాగిన రిలే దీక్షలు సోమవారం ముగిశాయి.
ఈ సందర్భంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ.. 2024 మార్చి నాటికి ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగులందరికీ రాష్ట్ర ప్రభుత్వం పెన్షనరీ బెనిఫిట్స్‌ను చెల్లించలేదని ఆరోపించారు. ఉద్యోగులు దాచుకున్న ప్రావిడెంట్ ఫండ్, టీజీజీఎల్ఐ సొమ్మును ప్రభుత్వం దోచుకోవడం దుర్మారమైన చర్య అని దుయ్యబట్టారు.