రెండు నెలలుగా పింఛన్ ఇవ్వట్లే.. గుట్ట మున్సిపల్ చైర్‌పర్సన్‌ను నిలదీసిన పింఛన్‌దారులు
‘రెండు నెలలుగా పింఛన్ ఇవ్వడం లేదు. పదిరోజులుగా మున్సిపాలిటీ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదు’ అంటూ వికలాంగులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు శుక్రవారం యాదగిరిగుట్ట మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు.
- యాదాద్రి జిల్లా ఆలేరు మండలం కొలనుపాకలోనూ రోడ్డుపై ధర్నా
యాదగిరిగుట్ట/ఆలేరు రూరల్, మే 29 : ‘రెండు నెలలుగా పింఛన్ ఇవ్వడం లేదు. పదిరోజులుగా మున్సిపాలిటీ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదు’ అంటూ వికలాంగులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు శుక్రవారం యాదగిరిగుట్ట మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు. చైర్పర్సన్ గుండ్లపల్లి వాణీభరత్గౌడ్ను నిలదీశారు. కార్యాలయంలోకి వెళ్లకుండా ఆమెను అడ్డుకున్నారు.
రూ.2,016 ఇవ్వాల్సి ఉండగా కేవలం రూ.2 వేలు మాత్రమే ఇస్తున్నారని, మిగతా రూ.16 ఇవ్వడం లేదని వాపోయారు. పింఛన్ ఇచ్చేలా చూస్తానని ఎన్నికల సమయంలో చెప్పిన కాంగ్రెస్ ఎమ్మెల్యే ఐలయ్య ఇప్పుడు కనిపించడం లేదని ఆరోపించారు. కేసీఆర్ ప్రభుత్వం ప్రతినెలా పింఛన్ ఇచ్చిందని గుర్తుచేశారు. కాగా సకాలంలో పింఛన్ అందజేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం ఆలేరు మండలంలోని కొలనుపాక ప్రధాన రహదారిపై పింఛన్‌దారులు ధర్నా చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

