దుగ్గొండి మార్చి 16 : నర్సంపేట నియోజకవర్గంలో అధికార పార్టీకి పోలీసులు తొత్తులుగా ప్రవర్తిస్తూ ప్రతిపక్ష కార్యకర్తలపై విచక్షణారహితంగా లాఠీ చార్జి చేయడాన్ని మాజీ పెద్ద సుదర్శన్ రెడ్డి ఖండించారు. ఆదివారం గిర్నిబావి వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈనెల 15వ తేదీన కొమ్మాల లక్ష్మీనరసింహస్వామి జాతర సందర్భంగా సెంటర్లో ఎటువంటి హెచ్చరికలు లేకుండా ఆయుధాలను లోడ్ చేస్తూ వాటర్ కెనాన్ ప్రదర్శిస్తూ భక్తులను, ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారు. ఎలాంటి హెచ్చరికలు లేకుండా ఏకపక్షంగా తమ కార్యకర్తలపై లాఠీ ప్రయోగించిన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని వరంగల్ సీపీ సంప్రీత్ సింగ్ను డిమాండ్ చేశారు.
పోలీసులలు అత్యుత్సాహంతో అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తూ ప్రతిపక్ష పార్టీలను ఇబ్బందులు పెడుతున్నారని విమర్శించారు. అఖిలపక్ష సమావేశంలో పోలీస్ డిపార్ట్మెంట్ నిర్ణయించిన సమయానికి తమ ప్రభలను తరలించామని కావాలనే అధికార పార్టీకి చెందిన ప్రభ లను ముందుగా తరలించి పోలీసులు తమ కార్యకర్తలను రెచ్చగొట్టారన్నారు. ఈ ఘటనకు కారణమైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని సీపీని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు సుకినే రాజేశ్వరరావు, జడ్పీ వైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పొన్న మొగిలి, క్లస్టర్ ఇంచార్జ్ కంచరకుంట్ల శ్రీనివాస్ రెడ్డి, మెరుగు రాంబాబు, శంకేష్ కమలాకర్, పిండి కుమారస్వామి, సింగతి రాజన్న, గుడిపల్లి జనార్ధన్ రెడ్డి, తిరుపతిరెడ్డి, ఉమేష్ రెడ్డి, నాయకులు కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.