హైదరాబాద్, జూన్ 3 (నమస్తేతెలంగాణ): నటుడు రామ్‌చరణ్ హీరోగా నటించిన పెద్ది సినిమా టికెట్ రేట్ల పెంపునకు రాష్ట్ర ప్రభు త్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. తెలంగాణలోని సింగిల్ స్క్రీన్లకు రూ.100, మల్టీఫ్లెక్స్ థియేటర్లలో ఒక్కో టికెట్‌పై రూ.150 చొప్పున పెంచుకోవచ్చని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొన్నది. గురువారం నుంచి ఈ నెల 13 వరకు ఐదు షోలు వేసేందుకు అనుమతిస్తూ హోంశాఖ ముఖ్య కార్యదర్శి శిఖా గోయల్ ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.