హుజూరాబాద్ టౌన్, ఆగస్టు 21: హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌కు కరీంనగర్ జిల్లా హుజూరా బాద్ మండలం పెద్దపాపయ్యపల్లె వాసులు వినూత్న గిఫ్ట్ ఇచ్చారు. ఉప ఎన్నికలో ఉద్యమకారుడికి మద్దతునిస్తూ శనివారం ఏకగ్రీవ తీర్మానం చేశారు. తీర్మాన ప్రతిపై సర్పంచ్ రజిత, ఉప సర్పంచ్ శ్రీనివాస్‌రెడ్డి, వార్డుసభ్యులు సంతకాలు చేశారు. అనంతరం పంచాయతీ కార్యాలయ ఆవరణలో గెల్లు బర్త్‌డే వేడుకలు నిర్వహించారు.