ఎన్టీపీసీ ‘బూడిద’పై పోరుబాట
ఎన్టీపీసీ బూడిద చెరువు కారణంగా మూడు దశాబ్దాలుగా ఇబ్బందులు పడుతున్న పెద్దపల్లి జిల్లా రామగుండం మండలంలోని కుందనపల్లి గ్రామస్థుల సమస్యను తొలగించాలని రామగుం డం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ డిమాండ్ చేశారు. సోమవారం కుందనపల్లి నుంచి పెద్దపల్లి
సంస్థ నిర్లక్ష్య వైఖరిపై ఎమ్మెల్యే కోరుకంటి ఆగ్రహం
కుందనపల్లి నుంచి పెద్దపల్లి వరకు మహాపాదయాత్ర
అంతర్గాం ఫిబ్రవరి 21: ఎన్టీపీసీ బూడిద చెరువు కారణంగా మూడు దశాబ్దాలుగా ఇబ్బందులు పడుతున్న పెద్దపల్లి జిల్లా రామగుండం మండలంలోని కుందనపల్లి గ్రామస్థుల సమస్యను తొలగించాలని రామగుం డం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ డిమాండ్ చేశారు. సోమవారం కుందనపల్లి నుంచి పెద్దపల్లి కలెక్టరేట్ వరకు 20 కిలోమీటర్ల మేర ఎమ్మెల్యే మహాపాదయాత్ర చేపట్టారు. రామగుండం ఎన్టీపీసీ ప్రభావిత గ్రామమైన కుందనపల్లిలో బూడిద చెరువు ప్రభావంతో గ్రామస్థులు అనారోగ్యం పాలవుతున్నారు. గతంలో పాలకులు, ఎన్టీపీసీ యాజమాన్యానికి మొర పెట్టుకొంటే మరోచోటుకు తరలిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటివరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. సమస్య తీవ్రంగా మారడంతో గ్రామంలోని మహిళలు 20 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. వారి దీక్షలకు సంఘీభావం తెలిపిన ఎమ్మెల్యే సోమవారం మహా పాదయాత్ర చేపట్టారు. ఎన్టీపీసీ యాజమాన్యం మొండివైఖరి వీడి కుందనపల్లి గ్రామస్థులకు సకల వసతులతో పునరావాసం కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. పాదయాత్రలో అంతర్గాం ఎంపీపీ దుర్గం విజయ, జడ్పీటీసీ ఆముల నారాయణ, రామగుండం మేయర్ అనిల్కుమార్, ఇతర ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
ఢిల్లీలో ఎన్టీపీసీ సీఅండ్ఎండీకి ఎంపీ వెంకటేశ్ వినతి
హైదరాబాద్, ఫిబ్రవరి 21 : ఎన్టీపీసీ బూడిద సమస్య శాశ్వత పరిష్కారానికి చర్యలు చేపట్టాలని పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ ఎన్టీపీసీ సీఎండీని కోరారు. ఈ మేరకు ఆయన సోమవారం ఢిల్లీలో ఎన్టీపీసీ సీఅండ్ఎండీ గురుదీప్సింగ్ను కలిసి విజ్ఞప్తి చేశారు. తన విజ్ఞప్తికి ఎన్టీపీసీ సీఅండ్ఎండీ సానుకూలంగా స్పందించారని ఎంపీ తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Steve Smith | టెస్టుల్లో స్టీవ్ స్మిత్ సంచలనం.. రూట్ రికార్డు గల్లంతు..!
Harish Rao | రేపు గద్వాలలో పర్యటించనున్న హరీశ్ రావు.. షెడ్యూల్ ఇదే..!
CM Vijay | ప్రజలకు తాగునీటి కోసం ఏపీలో తమిళనాడు సీఎం.. అధిష్టానం మెప్పుకోసం ఢిల్లీలో రేవంత్..!
KU | కేయూ బయోటెక్నాలజీ విభాగాధిపతిగా శ్రీనివాస్..!
Nalgonda | గ్రామసభల్లోనే ‘ఇందిరమ్మ’ లబ్ధిదారుల ఎంపిక జరగాలి.. కలెక్టర్కు సర్పంచుల సంఘం జేఏసీ వినతి..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

