పెద్దపల్లి, మే 9 (నమస్తే తెలంగాణ): పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీకి చెందిన శశాంక్ దహగామ ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్-2025 ఫలితాల్లో 78వ ర్యాంకు సాధించారు. తెలంగాణ రాష్ట్రంలో శశాంక్దే మొదటి ర్యాంకు. దేశంలో ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్-2025 (ఐఎఫ్ఎస్) మొత్తం 9.4 లక్షల మంది అభ్యర్థులు యూపీఎస్సీ ప్రిలిమ్స్‌కు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో మెయిన్స్‌కు 2,116 మంది అర్హత సాధించగా, వీరిలో 372 మంది ఇంటర్వ్యూ వరకు రాగా, 148 మంది ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్‌కు ఎంపికయ్యారు. దహగామ శశాంక్ తండ్రి ఉమా మహేశ్వర్ రైతు, పర్యావరణవేత్త. తల్లి నాగలక్ష్మి న్యాయవ్యాదిగా పనిచేస్తున్నారు.