ముషీరాబాద్, అక్టోబర్ 2: దేశంలోని 13 రాష్ర్టాలకు చెందిన ప్రగతిశీల, విప్లవ విద్యార్థి సంఘాలు ఏకతాటిపైకి వచ్చి ఉమ్మడి పీడీఎస్యూ ఆలిండియా ఆర్గనైజింగ్ కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీ సభ్యులుగా నామాల ఆజాద్, రామకృష్ణ(తెలంగాణ), తిమ్మన్న(కర్ణాటక), భవానీ(ఒడిశా), రాకేశ్, పవిత్ర(ఏపీ), నయన్, మనోజ్(అస్సాం), తిరుపతి(ఢిల్లీ), హన్మంత్హండే(మహారాష్ట్ర), నరసింహరావు(తెలంగాణ), అహిర్, అనిందిత(పశ్చిమబెంగాల్)లు ఎంపికైనట్టు కన్వీనర్ ప్రకటించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రగతి శీల విప్లవ, విద్యార్థి సంఘాల విలీనంతో కేంద్ర, రాష్ట్రస్థాయిలో విద్యార్థి సమస్యలపై ఉద్యమాలు చేపడతామని, విద్య ప్రైవేటీకరణను అడ్డుకుంటామన్నారు.