ఓ డీసీఎం వ్యాన్లో అక్రమార్కులు పీడీఎస్ బియ్యాన్ని తరలిస్తున్నారు. విషయం తెలుసుకున్న టాస్క్ఫోర్స్ పోలీసులు ఆ వ్యాన్ను వెంబండించారు. వ్యాన్ డ్రైవర్ పోలీసులపై కారంపొడి చల్లి స్పీడ్ పెంచాడు. పోలీసులు ఏ మాత్రం తగ్గకుండా సినీఫక్కీలో ఆ వ్యాన్ను చేజ్ చేశారు. పీడీఎస్ బియ్యాన్ని పట్టుకున్నారు. అక్రమార్కులపై కేసు నమోదు చేశారు.
ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలో జరిగింది. డీసీఎం వాహనంలో భారీగా రేషన్ బియ్యం తరలిస్తున్నారన్న సమాచారంతో టాస్క్ఫోర్స్ సీఐ వెంకటేశ్ నేతృత్వంలోని బృందం తనిఖీకి వెళ్లింది. అయితే, అక్రమార్కులు మితిమీరిన వేగంతో జాతీయ రహదారి 44 గుండా తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పోలీసులపైకి వాహన డ్రైవరు కారంపొడి చల్లాడు. దాదాపుగా 25 కిలోమీటర్లు చేజింగ్ అనంతరం వాహనం ఓనర్ సాజిద్తో సహా డ్రైవరు, క్లీనర్లను పోలీసులు అరెస్టు చేశారు. వీరిపై హత్యాయత్నం కేసు కూడా నమోదు చేశారు. ఈ ఘటన ఆదివారం తెల్లవారుజామున జరగ్గా, పోలీసులు ఆదివారం సాయంత్రం వివరాలు వెల్లడించారు.