హైదరాబాద్, సెప్టెంబర్19 (నమస్తే తెలంగాణ): గురుకులాల్లోని బోధన, బోధనేతర సిబ్బందికి ఎట్టకేలకు జీతాలు పడ్డాయి. గురువారం మధ్యా హ్నం నుంచి వేతనాలను వారి ఖాతాల్లో జమ చేశారు. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ, జనరల్ గురుకులాల్లోని రెగ్యులర్ ఉద్యోగులు, ఇటీవల కొత్తగా నియామకమైన ఉద్యోగులు, అదేవిధంగా పార్ట్ టైం, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ఇప్పటివరకు ప్రభుత్వం వేతనాలను చెల్లించలే దు.
ఈ నేపథ్యంలోనే ‘తొలి జీతమే చేదు జ్ఞాపకం’ పేరిట నమస్తే తెలంగాణ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించింది. వారందరికీ వేతనాలను విడుదల చేసిం ది. కానీ పార్ట్‌టైం, గెస్ట్‌ఫ్యాకల్టీ, హానరోరియం ఉద్యోగులకు ఈసారి కూడా ప్రభుత్వం మొండిచెయ్యే చూపింది. పండుగల నే పథ్యంలో వేతనాలను వెంటనే చెల్లించాలని ఔట్సోర్సింగ్ ఉద్యోగులు కోరుతున్నారు.