హైదరాబాద్, సెప్టెంబర్25 (నమస్తే తెలంగాణ): రుణాలు, బిల్లుల చెల్లింపు మొత్తం కూడా నిబంధనల మేరకే కొనసాగిందని జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్‌కు కాళేశ్వరం కార్పొరేషన్ అధికారులు నివేదించారు. కమిషన్ బుధవారం నిర్వహించిన బహిరంగ విచారణకు కాళేశ్వరం కార్పొరేషన్, జనరల్ అకౌంట్స్ అధికారులైన వెంకట అప్పారావు, పద్మావతి, మణిభూషన్ శర్మ హాజరయ్యారు. కాళేశ్వరం నిర్మాణానికి నిధుల సేకరణ, బిల్లు ల చెల్లింపులు, కార్పొరేషన్ ఆదాయ, వ్య యాలు, కాగ్ నివేదికలోని పలు అంశాలపై వారిని కమిషన్ ప్రశ్నించింది. ప్రాజెక్టు పూర్తయితే అవి కార్పొరేషన్‌కు ఆస్తులుగా బదలాయిస్తారని అధికారులు వెల్లడించారు. గురువారం కూడా కమిషన్ విచారణ కొనసాగనున్నది.