కస్టోడియల్ బాధితుడికి రూ. 50 వేలు ఇవ్వండి
నల్లగొండ జిల్లా వాడపల్లి పోలీస్‌స్టేషన్ పరిధి కొత్తపేట తండాకు చెందిన గిరిజన యువకుడు, ఆటోడ్రైవర్ ధనావత్ సాయి సిద్ధుపై జరిగిన కస్టోడియల్ టార్చర్ కేసులో ఎన్హెచ్ఆర్సీ కీలక ఆదేశాలు జారీ చేసింది. బా
- సీఎస్, డీజీపీలకు ఎన్హెచ్ఆర్సీ ఆదేశం
హైదరాబాద్, జూలై 15 (నమస్తే తెలంగాణ): నల్లగొండ జిల్లా వాడపల్లి పోలీస్‌స్టేషన్ పరిధి కొత్తపేట తండాకు చెందిన గిరిజన యువకుడు, ఆటోడ్రైవర్ ధనావత్ సాయి సిద్ధుపై జరిగిన కస్టోడియల్ టార్చర్ కేసులో ఎన్హెచ్ఆర్సీ కీలక ఆదేశాలు జారీ చేసింది. బాధితుడికి తక్షణం రూ. 50 వేల నష్టపరిహారం చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వానికి బుధవారం ఆదేశాలు జారీ చేసింది. 2025 సెప్టెంబర్ 9న అర్ధరాత్రి సాయి ఇంటిలోకి అక్రమంగా చొరబడిన పోలీసులు అతన్ని బయటకు తీసుకెళ్లి, కుల దూషణలు చేస్తూ థర్డ్ డిగ్రీ హింసకు గురిచేశారు. ఎలాంటి గాయాలు లేవని మిర్యాలగూడ ప్రభుత్వ దవాఖాన వైద్యుడితో కోర్టుకు తప్పుడు నివేదికలు సమర్పించారు. తర్వాత నల్లగొండ దవాఖానలో నిర్వహించిన రెండోసారి వైద్య పరీక్షల్లో తీవ్రగాయాలు ఉన్నట్టు తేలడంతో బాధితుడి తరఫున న్యాయవాది కారుపోతుల రేవంత్ ఎన్హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేశారు. తెలంగాణ ప్రధాన కార్యదర్శి, డీజీపీలు నోటీసులకు స్పందించకపోవడంపై ఎన్హెచ్ఆర్సీ అసంతృప్తి వ్యక్తం చేస్తూ బాధితుడికి రూ.50,000 పరిహారం చెల్లించాలని ఆదేశించింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nagarjuna Sagar | నాగార్జునసాగర్ డ్యాం ఎడమ కాలువకు నీటి విడుదల చేసిన ఎన్ఎస్పీ అధికారులు
Varanasi | ‘వారణాసి’లో రామాయణ ఘట్టమే హైలైట్.. రాజమౌళి స్వయంగా తీసుకున్న సవాల్ ఇదే!
Ponnam Prabhakar | ఆర్టీసీ–మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గుతాయా? కీలక విషయాలను వెల్లడించిన పొన్నం ప్రభాకర్
Karepalli | అధిక లోడుతో సుబాబుల్ లారీలు.. గ్రామాల మీదుగా యథేచ్ఛగా రవాణా!
Naresh | పెళ్లి చేసుకున్నా, చేసుకోకపోయినా పర్వాలేదు.. పిల్లల్ని మాత్రం కనండి: నటుడు నరేశ్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

