హైదరాబాద్, మార్చి 5 (నమస్తే తెలంగాణ ) : ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థిగా తన సోదరుడు కొణిదెల నాగబాబు పేరును జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ బుధవారం ప్రకటించారు. తెలుగు రాష్ట్రాల్లో ఖాళీ అవుతున్న ఎమ్మెల్యే కోటాలోని ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. మంగళవారం నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. ఏపీ అసెంబ్లీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి 164 మంది సభ్యుల బలం ఉంది. దీంతో నాగబాబు ఎన్నిక లాంఛనం కానున్నది.