పవన్ కల్యాణ్ వైఖరి సరికాదు.. జాన్ వెస్లీ
పవన్ కల్యాణ్ తెలంగాణకు రావడం, ప్రచారం చేసుకోవడాన్ని తాము వ్యతిరేకించబోమని, కానీ ప్రాంతీయ విద్వేష వైఖరితో ఆయన మాట్లాడటం సరికాదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ పేర్కొన్నారు.
హైదరాబాద్, జూన్ 6 (నమస్తే తెలంగాణ) : పవన్ కల్యాణ్ తెలంగాణకు రావడం, ప్రచారం చేసుకోవడాన్ని తాము వ్యతిరేకించబోమని, కానీ ప్రాంతీయ విద్వేష వైఖరితో ఆయన మాట్లాడటం సరికాదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ పేర్కొన్నారు. శనివారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో నిర్వహించిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. కమ్యూనిజంపై అవగాహన లేని అజ్ఞాని పవన్ అని విమర్శించారు.
సమాజంలో దోపి డీ ఉన్నంతకాలం కమ్యూనిజం ఉంటుందని స్పష్టంచేశారు. రాష్ట్ర విభజన హామీలను నెరవేర్చడంలో మోదీ సర్కార్ విఫలమైందని పేర్కొన్నారు. రైతులు పండించిన పంటల్ని కొనలేని పరిస్థితిలో పాలకులు ఉన్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
రెండు లక్షల ఉద్యోగాలేవీ?
ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాల భర్తీ హామీని కాంగ్రెస్ సర్కార్ విస్మరించిందని జాన్వెస్లీ మండిపడ్డారు. కౌలు రైతులు, వ్యవసాయ కూలీలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ సర్కార్ విస్మరించిందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో 30 లక్షల మంది పేదలకు స్థలాలు ఇచ్చి ఇండ్లు కట్టివ్వాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Meerut | భర్తను చంపిన భార్య, ఆమె ప్రియుడికి మరణశిక్ష.. హత్య చేసి పాముకాటుగా నమ్మించిన భార్య
School Shooting: అమెరికా స్కూల్లో కాల్పుల ఘటన.. ముగ్గురు చిన్నారులు మృతి
Tragedy | సత్యసాయి జిల్లాలో విషాదం.. రిజర్వాయర్లో ప్రమాదవశాత్తు పడి ఐదుగురు బాలికలు మృతి
Bhuvneshwar Kumar: గాయపడ్డ అర్షదీప్.. భారత బృందంలోకి భువనేశ్వర్
Warangal | వరంగల్ డిఐజి ఆఫీస్లో ఇద్దరు ఉద్యోగుల సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

