వికారాబాద్, డిసెంబర్ 2 (నమస్తే తెలంగాణ): లగచర్ల కేసులో కొ డంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి బెయిల్ పిటిషన్‌పై విచారణను వికారాబాద్ జిల్లా కోర్టు మరోసారి పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సోమవారం పట్నం నరేందర్ రెడ్డి బెయిల్ పిటిషన్‌పై విచారణను 5కు వాయిదా వేసింది. నవంబర్ 13న నరేందర్‌రెడ్డిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. మరోవైపు లగచర్ల రైతుల బెయిల్ పిటిషన్‌పై వాదనలు పూర్తికాగా తీర్పును వికారాబాద్ జిల్లా కోర్టు మంగళవారానికి వాయిదా వేసింది.
ఉపకులాలన్నీ విశ్వబ్రాహ్మణులే ;హైకోర్టుకు తెలిపిన రాష్ట్ర సరార్
హైదరాబాద్, డిసెంబర్ 2 (నమస్తే తెలంగాణ): విశ్వబ్రాహ్మణ కులంలోని ఉప కులాలన్నింటినీ ఒకటిగా పరిగణిస్తామని రాష్ట్ర సరార్ హైకోర్టుకు తెలిపింది. ప్రభుత్వ సర్వేలో వేర్వేరు సబ్ క్యాటగిరీలుగా ఉన్నా.. వాటిని ఒకే కులంగా పరిగణిస్తామని చెప్పింది. విశ్వబ్రాహ్మణుల ఉపకులాలను వేర్వేరు కులాలుగా పరిగణిస్తూ సర్వే నిర్వహించడం అన్యాయమంటూ విశ్వబ్రాహ్మిన్ అడ్వకేట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పీ శ్రీనివాస్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ సూరేపల్లి నంద ఇటీవల విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా ప్రభుత్వం పైవిధంగా హామీ ఇవ్వడంతో విచారణను ముగిస్తున్నట్టు న్యాయమూర్తి ప్రకటించారు.