నాంపల్లి క్రిమినల్ కోర్టులు, డిసెంబర్ 24 (నమస్తే తెలంగాణ): కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డితోపాటు మరో 23 మంది లగచర్ల రైతులు మంగళవారం హైదరాబాద్ నాంపల్లిలోని ప్రత్యేక (పీడీపీపీ) కోర్టు ఎదుట హాజరయ్యారు. హత్యాయత్నంతోపాటు పీడీపీపీ సెక్షన్ల కింద నమోదైన కేసుల్లో రైతులు ఇటీవలే బెయిల్‌పై విడుదలైన వారంతా ప్రభుత్వ ఆస్తుల ధ్వసం చట్టం కింద నమోదైన కేసులో కోర్టుకు హాజరయ్యారు. ఫార్మాసిటీ ఏర్పాటుకు ప్రభుత్వం భూములను గుంజుకునేందుకు యత్నించిన క్రమంలో రైతులు తిరగబడటంతో వారిపై వికారాబాద్ జిల్లా బొంరాస్‌పేట పోలీసులు కేసులు నమోదు చేశారు. నాంపల్లిలోని ఇన్చార్జి ఏసీబీ కోర్టు జడ్జి మహ్మద్ అఫ్రోజ్ అక్తర్ విచారణను మార్చి 28కి వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. లగచర్ల ఘటన కేసులో ఏ2 నిందితుడైన సురేశ్ తరఫున దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని పీడీపీపీ కోర్టు జడ్జి ఆదేశాలను జారీచేశారు. వాదనల కోసం విచారణను 27కు కోర్టు వాయిదా వేసింది. ఇదే కేసులో మరో ఇద్దరు నిందితుల తరఫున రెండో బెయిల్ పిటిషన్‌ను కోర్టుకు దాఖలు చేశారు.