Minister Mahender Reddy | హైదరాబా ద్, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, గనులు, భూగర్భవనరుల శాఖ మంత్రిగా పట్నం మహేందర్‌రెడ్డి బుధవారం పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ నెల 24న మంత్రిగా పట్నం ప్రమాణ స్వీకరించిన విషయం తెలిసిందే. సచివాలయం మొదటి అంతస్థులోని కార్యాలయంలో మధ్యాహ్నం 2 గం టలకు పట్నం బాధ్యతలను స్వీకరించనున్నారు. మంగళవారం సమాచారశాఖ అధికారులు మంత్రి మహేందర్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి, సత్కరించారు.
కార్యక్రమంలో సమాచార శాఖ డైరెక్టర్ బీ రాజమౌళి, అడిషనల్ డైరెక్టర్ నాగయ్య కాంబ్లీ, జా యింట్ డైరెక్టర్లు జగన్, శ్రీనివాస్, వెంకటరమణ, డిప్యూటీ డైరెక్టర్లు మధుసూధన్, రాజారెడ్డి, సీఐఈ రాధాకిషన్, మీడియా అకాడమీ కార్యదర్శి వెంకటేశ్వర్రావు తదితరులు ఉన్నారు.