హైదరాబాద్: యాసంగిలో సన్న వడ్లు పండించిన రైతులకు ప్రభుత్వం ఇప్పటికీ బోనస్ చెల్లించలేదని (Bonus for Fine Rice), ఆ మొత్తాన్ని వెంటనే విడుదల చేయాలని మెదక్ మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ల శశిధర్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రభుత్వం సుచించిన విధంగా సన్న రకం వడ్లు పండించినప్పటికీ బోనస్ ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. ఈమేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. ‘ ప్రభుత్వ సూచన మేరకు యాసంగి పంట కాలంలో తెలంగాణ వ్యాప్తంగా చాలా జిల్లాల్లో రైతులు సన్న రకం వరి పండిచారు. సన్నాలు పండించిన రైతులకు రూ.500 బోనస్ చెల్లిస్తామని సర్కాలు ప్రకటించింది. యాసంగి పంట కాలం అయిపోయినప్పటికీ ఇప్పటికీ బోనస్ ఇవ్వకపోవడం చాలా బాధాకరం, శోచనీయం. రాబోయే దసరా పండుగ సందర్భంగా రైతులకు ఎక్కడ కూడా డబ్బులు పుట్టవు. ఈనేపథ్యంలో ప్రభుత్వం తక్షణమే బోనస్ రూ.500 విడుదల చేయాలి.’ అని శశిధర్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు.