హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 28 (నమస్తే తెలంగాణ): పాస్‌పోర్ట్ దరఖాస్తు ప్రక్రియ మరింత సులభతరమైంది. పాస్‌పోర్ట్ కార్యాలయం వెబ్సైట్లో కొత్త ఆప్షన్ తీసుకొచ్చింది. గతంలో ఉన్న ప్రాసెస్ అంతా లేకుండానే పాస్‌పోర్ట్ సేవలు పొందొచ్చని హైదరాబాద్ రీజినల్ పాస్‌పోర్ట్ అధికారి దాసరి బాలయ్య శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. www. passportindia.gov.inలో పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకునే సమయంలో ‘డిజిలాకర్’ ఆప్షన్ క్లిక్ చేసి ఆధార్, పాన్‌కార్డ్ వివరాలు, ఫొటోలు వంటి చిరునామా వివరాలు అప్లోడ్ చేస్తే సరిపోతుంది.
అనంతరం స్లాట్ బుక్ అయిన రోజు నేరుగా పాస్‌పోర్ట్ కార్యాలయానికి వెళితే సరిపోతుందని, ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకెళ్లాల్సిన అవసరం లేదని ఆయన తెలిపారు.