హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 17 ( నమస్తే తెలంగాణ) : సికింద్రాబాద్‌లోని రీజినల్ పాస్‌పోర్ట్ కార్యాలయంలో ఈ నెల 20న పాస్‌పోర్ట్ అదాలత్ నిర్వహిస్తున్నట్టు హైదరాబాద్ రీజినల్ పాస్‌పోర్ట్ అధికారి జే స్నేహజ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తుల ప్రక్రియలో ఇబ్బందులు తలెత్తితే అదాలత్‌లో పరిష్కరించుకోవచ్చని సూచించారు.
ఉదయం 10 గంటల నుంచి మధ్నాహ్నం 12:30 గంటల వరకు అదాలత్ కొనసాగనున్నదని వెల్లడించారు. పాస్‌పోర్టుకు సంబంధించిన అవసరమైన అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్స్‌తో హాజరుకావాలని తెలిపారు.