హైదరాబాద్, జూన్ 14 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని పర్టిక్యులర్లీ వల్నరబుల్ గ్రూప్స్ (పీవీటీజీ) కొండరెడ్డి, కొలాం, తోటి, చెంచు తెగలకు చెందిన 49 మంది ఆదిమ గిరిజనుల ప్రతినిధులతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పార్లమెంట్ సెంట్రల్ హాల్లో సమావేశమయ్యారు. లోకసభ స్పీకర్ ఓంబిర్లా, కేంద్ర మంత్రి అర్జున్ ముండా కూడా వీరితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ముర్ము మాట్లాడుతూ గిరిజనుల అభివృద్ధి కోసం రాబోయే మూడేండ్లలో ప్రత్యేక నిధులు కేటాయించి కొత్త ప్రణాళికలు అమలు చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రపతిని కలిసే అవకాశాన్ని కల్పించిన రాష్ట్ర ప్రభుత్వానికి, గిరిజన సంక్షేమ కార్యదర్శి క్రిస్టినా జడ్చొంగ్తు, అడిషనల్ డైరెక్టర్ సర్వేశ్వర్‌రెడ్డి, జాయింట్ డైరెక్టర్లు, ఐటీడీపీల ప్రాజెక్ట్ అధికారులకు ఆదిమ తెగల ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు.