బయ్యారం, ఏప్రిల్ 10: ప్రేమ విఫలమై ప్రాణాలర్పించిన కొడుక్కి గుడి కట్టి ఏటా శ్రీరామ నవమి రోజు పెండ్లితంతు నిర్వహిస్తున్నారు ఓ మాతృమూర్తి. 18 ఏండ్లుగా విగ్రహానికి పెండ్లి చేస్తూ కొడుకుపై ఉన్న ప్రేమను చాటుకొంటున్నారు. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం సంత్రాల్పోడ్ తండాకు చెందిన సుక్కమ్మ, లాలు దంపతుల కుమారుడు రాంకోటి. 2004లో ఇంటర్ చదువుతున్న సమయంలో ప్రేమ విఫలమై ప్రేమికులిద్దరూ ఆత్మహత్య చేసుకొన్నారు.
సుక్కమ్మ నిత్యం కొడుకును తలుచుకుంటూ ఉండేవారు. ఈ క్రమంలో ఇంటి ఆవరణలోనే గుడి కట్టి రాంకోటితోపాటు ఆయన ప్రేయసి విగ్రహాన్ని సైతం ఏర్పాటు చేసి నిత్యం పూజలు చేస్తున్నారు. 2005 నుంచి ఏటా శ్రీరామ నవమి రోజు చుట్టుపక్కల వారిని ఆహ్వానించి కొడుకు విగ్రహానికి పెండ్లి జరిపిస్తున్నారు. పెండ్లి కాకుండానే చనిపోయిన తన కొడుకునే దేవుడిగా భావించి ఏటా వివాహం చేస్తున్నట్టు సుక్కమ్మ తెలిపారు.