Minister Seethakka | బచ్చన్నపేట, అక్టోబర్ 18 : తెలంగాణ పంచాయతీ రాజ్ శాఖలో పనిచేస్తున్న గ్రామపంచాయతీ ఉద్యోగులు(కారోబార్ల) సంఘం ప్రజా భవన్లో పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్కతో శనివారం భేటీ అయ్యారు. గత 35 సంవత్సరాలుగా గ్రామపంచాయతీలో కారోబార్లుగా పనిచేస్తున్న తమకు 51 జీవోను మినహాయించి, బిల్ కలెక్టర్లుగా ప్రమోషన్ ఇచ్చి పే స్కేల్ వర్తింపచేయాలని మంత్రికి వినతి పత్రం సమర్పించారు. వెంటనే స్పందించిన మంత్రి సీతక్క 51 జీవో, బిల్ కలెక్టర్ ప్రమోషన్‌కు సంబంధించిన ఫైల్‌ను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. పే స్కేల్ పై చర్చించి నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమములో గ్రామపంచాయతీ కారోబార్స్ రాష్ట్ర నాయకులు మామిడాల నర్సింహులు, శ్రీనివాస చారి, రవి యాదవ్, నాగరాజు, శ్రీధర్ యాదవ్, వెంకటేష్, సురేందర్, కట్టయ్య తదితరులు పాల్గొన్నారు.