సుల్తానాబాద్, జూలై 15 : భార్యాభర్తల పంచాయితీలో ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా మరొక రు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని సుగ్లాంపల్లిలో ఈ దారు ణం జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓదెల మండల కేంద్రాని కి చెందిన మౌటం మారయ్య, పెద్దపల్లిలోని శాంతినగర్‌కు చెందిన కనకమ్మను వివాహం చేసుకున్నాడు. ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో తరచూ గొడవలు జరుగుతున్నాయి. సమస్య పరిష్కారం కోసం పోలీసులను ఆశ్రయించారు. పెద్దల సమక్షంలో పంచాయితీలు జరిగాయి. మంగళవారం సుల్తానాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని సుగ్లాంపల్లి శివారు లో పంచాయితీ నిర్వహించారు. ఇరువర్గాల మధ్య మాటలు పెరగడంతో కనకమ్మ తరఫు న వచ్చినవారు పదునైన ఆయుధాలతో మౌటం మారయ్య తమ్ముడు మౌటం మల్లేశ్ (40)పై విచక్షణారహితంగా దాడిచేయడంతో అక్కడికక్కడే మృతిచెందాడు.
దీంతో మార య్య తరఫున వచ్చినవారు కనకమ్మ తరఫున పెద్దమనిషిగా వచ్చిన పెద్దపల్లి మండలం రాఘవాపూర్‌కు చెందిన గాండ్ల గణేశ్పైన దాడి చేయడంతో అతడు సైతం అక్కడికక్కడే మృతిచెందాడు. ఇరువర్గాలు ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడంతో మల్లేశ్ అన్నలు మధునయ్య, మారయ్య, తండ్రి సారయ్య తీవ్రంగా గాయపడ్డారు. సుల్తానాబాద్ సీఐ సుబ్బారెడ్డి, ఎస్ఐ శ్రావణ్‌కుమార్, పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని గాయపడ్డవారిని కరీంనగర్ దవాఖానకు తరలించారు. ఇందులో మధునయ్య పరిస్థితి విషమంగా ఉంది. ఇరువర్గాల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తుచేస్తున్నట్టు సీఐ, ఎస్ఐ తెలిపారు. మృతుల స్వగ్రామాలైన ఓదెల, రాఘవాపూర్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి. మల్లేశ్‌కు భార్య, కొడుకు, కూతురు ఉన్నారు. పెద్దపల్లి మండలం రాఘవాపూర్‌కు చెందిన గాండ్ల గణేశ్‌కు భార్య రజితతో పాటు ఆరేళ్ల కూతురు ఉన్నది.