మహబూబాబాద్ రూరల్, సెప్టెంబర్ 17 : మహబూబాబాద్ జిల్లా సండ్రాలగూడెంలో రెండేండ్లుగా అద్దె చెల్లించడం లేదని గ్రామ పంచాయతీ కార్యాలయ భవనానికి యజమాని బాబూమియా తాళం వేశారు. తన ఇంటిని జీపీ ఆఫీస్కు నెలకు రూ.800 మొత్తానికి అద్దెకు ఇచ్చానని, గతంలో అధికారులు ఆరు నెలలకోసారి అద్దె చెల్లించేవారని తెలిపాడు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కిరాయి కట్టడంలేదని చెప్పాడు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని చెప్పినా అధికారులు అద్దె ఇవ్వడం లేదని బాబూమియా తెలిపాడు.