యాదాద్రి: యాదాద్రి పుణ్యక్షేత్రంలో ఆలయ ఉద్ఘాటన కార్యక్రమాలు నాలుగో రోజుకు చేరుకున్నాయి. మహాకుంభ సంప్రోక్షణలో భాగంగా పంచకుండాత్మక మహాయాగం నిర్వహిస్తున్నారు. బాలాలయంలో శాంతి పాఠం, చతుఃస్థానార్చన, మూలమంత్ర హవనం చేశారు. ప్రధానాలయంలో పంచవింశతి కలశ స్నపనం, నిత్యలఘు పూర్ణాహుతి చేయనున్నారు.
సాయంత్రం 6 గంటలకు బాలాలయంలో సామూహిక శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం, యగశాలలో ద్వార తోరణ ధ్వజ కుంభ ఆరాధనలు, మూల మంత్ర హవనం నిర్వహిస్తారు. ప్రధానాలయంలో చతుఃస్థానార్చన గావించి ప్రతిష్ఠామూర్తులకు జలాధి వాసం చేపట్టి నిత్య లఘు పూర్ణాహుతితో ముగిస్తారు.