హైదరాబాద్, జూన్ 18(నమస్తే తెలంగాణ): పామాయిల్ సాగు, సూక్ష్మ సేద్యానికి రూ. 100.76 కోట్ల బకాయిలను విడుదల చేసినట్టు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. 2023-24 సంవత్సరానికి మొత్తం 133.50 కోట్లు నిధులు అవసరం కాగా, ఇందులో గత ప్రభుత్వం రూ. 32.72 కోట్లు విడుదల చేసిందని చెప్పారు.
మిగిలిన రూ.100.76 కోట్ల నిధులను ప్రస్తుతం విడుదల చేసినట్టు తెలిపార. ఈ నిధులను రెండుమూడు రోజుల్లో పామాయిల్ రైతులకు, సూక్ష్మసేద్యం కంపెనీలకు అందించేందుకు చర్యలు తీసుకోవాలని ఉద్యాన శాఖను మంత్రి ఆదేశించారు. ఇక ఇప్పటికే 2022-23కు సంబంధించి సూక్ష్మసేద్యం బకాయిలు రూ. 55.36 కోట్లను విడుదల చేసినట్టు తెలిపారు.