పల్లెల్లో పరిమళాలు
ఊర్లోకి సీసీ రోడ్లు వచ్చినయ్.. రోడ్డు పక్కన చెత్త మాయమైంది.. ఊగులాడే విద్యుత్తు వైర్లు లేకుండా పోయినయ్.. మురుగు కాలువలు మంచిగైనయ్.. పనికిరాని బోరుబావులు మూతవడ్డయ్.. వైకుంఠ ధామాలకు కరెంటొచ్చింది.. అవసరం ఉన్న చోట విద్యుత్తు మీటర్లు వచ్చినయ్..
5వ విడత పల్లె ప్రగతి విజయవంతం
12,769 పంచాయతీలు పరిశుభ్రం
మొత్తం 6,51,000 మంది శ్రమదానం
కార్యక్రమంతో గ్రామాలకు మహర్దశ
పెరిగిన భూముల రేట్లు: మంత్రి పువ్వాడ
హైదరాబాద్ (నమస్తే తెలంగాణ)/ రఘునాథపాలెం/ నిర్మల్ అర్బన్, జూన్18: ఊర్లోకి సీసీ రోడ్లు వచ్చినయ్.. రోడ్డు పక్కన చెత్త మాయమైంది.. ఊగులాడే విద్యుత్తు వైర్లు లేకుండా పోయినయ్.. మురుగు కాలువలు మంచిగైనయ్.. పనికిరాని బోరుబావులు మూతవడ్డయ్.. వైకుంఠ ధామాలకు కరెంటొచ్చింది.. అవసరం ఉన్న చోట విద్యుత్తు మీటర్లు వచ్చినయ్.. మొత్తంగా 5వ విడత పల్లె ప్రగతి విజయవంతమైంది. రాష్ట్రంలోని 12,769 గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి, పారిశుద్ధ్య పనులు సాఫీగా సాగినయ్. ఈ నెల 3న ప్రారంభమైన పల్లె ప్రగతి.. శనివారం విజయవంతంగా ముగిసింది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టి పూర్తి చేసింది. అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రజలను భాగస్వామ్యం చేసేలా దేశంలోనే తొలిసారి 12,769 గ్రామాల్లో పనుల కమిటీ, పారిశుద్ధ్య కమిటీ, వీధి కమిటీ, పచ్చదనం కమిటీ తదితర కమిటీలను ఏర్పాటు చేశారు. కాగా, శనివారం నిర్మల్‌లో నిర్వహించిన పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం చెరువుకొమ్ముతండా, వేపకుంట్ల గ్రామాల్లోని కార్యక్రమాల్లో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పల్లెలు అభివృద్ధి చెందితేనే రాష్ర్టాభివృద్ధి సాధ్యమని నమ్మిన సీఎం కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా పల్లె ప్రగతిని అమలు చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమం వల్ల గ్రామాల్లో సీజనల్ వ్యాధులు దూరమయ్యాయని చెప్పారు. ఊరూరా డంపింగ్ యార్డు, వైకుంఠధామం, పల్లె ప్రకృతి వనం, నర్సరీలు ఏర్పాటయ్యాయని అన్నారు. ప్రతి పంచాయతీకి ట్యాంకర్, ట్రాలీ సమకూరిందని వివరించారు. మిషన్ భగీరథతో ప్రజల తాగునీటి కష్టాలు తీరాయని వెల్లడించారు. ముఖ్యంగా పల్లె భూములకు రెక్కలొచ్చాయని మంత్రి పేర్కొన్నారు.

నిర్మల్‌లో పల్లెప్రగతి కార్యక్రమంలో మాట్లాడుతున్న మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి
పల్లె ప్రగతి విజయాలు:


- రాష్ట్రవ్యాప్తంగా 12,769 గ్రామ పంచాయితీల్లో చెత్త సేకరణ, రితహారం కింద నాటిన మొకలకు నీటి సరఫరా కోసం ప్రభుత్వం ట్రాక్టర్లు, ట్రాలీలను సమకూర్చింది.
- గ్రామాల్లో రూ.116 కోట్లతో 19,472 పల్లె ప్రకృతి వనాలు, రూ.1,555 కోట్లతో 12,669 వైకుంఠధామాలు, రూ.318 కోట్లతో 12,753 డంపింగ్ యార్డుల నిర్మాణాలు చేపట్టింది. మిగిలిన పది వైకుంఠధామాల నిర్మాణం త్వరలోనే పూర్తి కానున్నది.
- పల్లెప్రగతి కింద పల్లెల్లో అభివృద్ధి కార్యక్రమాల కోసం 2019 సెప్టెంబర్ నుంచి ఇప్పటి వరకు రూ.9,800 కోట్లు స్థానిక సంస్థలకు గ్రాంట్ల రూపంలో మంజూరు చేసింది.
- పలు అభివృద్ధి కార్యక్రమాల అమలుకు ప్రతి నెల రూ.256.66 కోట్ల చొప్పున గ్రామీణ స్థానిక సంస్థలకు విడుదల చేస్తున్నది.
- రాష్ట్రంలోని 545 మండలాల్లో 5-10 ఎకరాల్లో 2,725 బృహత్ పల్లె ప్రగతి వనాలను ఏర్పాటు చేయాలని లక్ష్యం పెట్టుకోగా, ఇప్పటికే 594 బృహత్ పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటయ్యాయి. మిగిలినవాటిని నెలలోగా పూర్తి చేయనున్నారు.
- గ్రామాలలో వీధి దీపాలకు ఆన్‌అండ్‌ఆఫ్ సౌకర్యానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చింది. 50,230 కిలోమీటర్ల పొడవున థర్డ్ వైర్, రూ.330 కోట్లతో 2,33,135 విద్యుత్తు స్తంభాలను ఏర్పాటు చేసింది.
- ప్రతి గ్రామపంచాయతీలో ఒక నర్సరీని ఏర్పాటు చేయడంతోపాటు 251 కోట్ల మొకలను నాటి సంరక్షించారు. రోడ్లకు ఇరువైపులా 8305 కిలోమీటర్ల మేర బహుళ వరుసల్లో అవెన్యూ ప్లాంటేషన్ చేపట్టారు.
- దేశంలోని టాప్‌టెన్ ఓడీఎఫ్ గ్రామాలన్నీ తెలంగాణవే కావటం విశేషం. మొదటి 20 ఉత్తమ గ్రామాల్లో 19 గ్రామాలు తెలంగాణవే. ఇది పల్లె ప్రగతి సాధించిన ఘన విజయం.
5వ విడతలో చేసిన కార్యక్రమాలు
మరమ్మతులు రోడ్లు – 63 కిలోమీటర్లు
మురుగు కాలువలు – 36 కి.మీ.
పారిశుద్ధ్యం: మురుగు కాలువల్లో పూడికతీత
12,769 గ్రామాలు శుభ్రం చేసిన ప్రభుత్వ సంస్థలు 80,405
పూడ్చివేత: లోతట్టు ప్రాంతాలు – 19,349
పనికిరాని బోరుబావులు – 1,098
నిరుపయోగ బావులు – 1,902
నిర్మాణం: వ్యక్తిగత మ్యాజిక్ సోక్ పిట్స్ – 20,296
సామాజిక సోక్ పిట్స్ – 3,905
సౌకర్యాలు:
విద్యుత్తు: 1,306
వైకుంఠధామాలకు మరుగుదొడ్లు – 1,002
వైకుంఠధామాల్లో మూడో వైరు – 17,710
విద్యుత్తు స్తంభాలకు విద్యుత్తు మీటర్లు – 1,206
అవెన్యూ ప్లాంటేషన్ కోసం గుర్తించిన రోడ్లు – 10,946 కిలోమీటర్లు
శ్రమదానంలో భాగస్వాములు 6,51,000
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medical Services | వైద్య సేవలు, నిర్వహణ మెరుగ్గా ఉండాలి : కలెక్టర్ చాహత్‌బాజ్‌పాయ్
ATA bathukamma celebrations | ఆస్ట్రేలియా గడ్డపై అంగరంగ వైభవంగా.. 6 వేల మందితో మెల్బోర్న్ లో బతుకమ్మ వేడుకలు
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Suicide | పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య
NHM Employees | ఉరి తాళ్లతో ఎన్హెచ్ఎం ఉద్యోగుల నిరసన
ట్రెండింగ్ వార్తలు
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!

