హైదరాబాద్, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన పల్లె నాగేశ్వర్రావు అభినందన సభ ఈ నెల 21న నిర్వహించనున్నట్టు కార్యక్రమ సమన్వయకర్త, తెలంగాణ బార్ కౌన్సిల్ సభ్యుడు చలకాని వెంకట్యాదవ్ తెలిపారు. హైదరాబాద్ బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సాయంత్రం 6 గంటలకు సభ ప్రారంభమవుతుందని వెల్లడించారు.
హైకోర్టు బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు పొన్నం అశోక్ గౌడ్ అధ్యక్షతన జరిగే ఈ సభకు రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ కే లక్ష్మణ్, జస్టిస్ ఎంజీ ప్రియదర్శిని, జస్టిస్ సీవీ భాసర్ రెడ్డి, జస్టిస్ బీమపాక నగేశ్, జస్టిస్ పుల్లా కార్తిక్, హైకోర్టు అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ తదితరులు హాజరవుతారని తెలిపారు.